Tollywood: డబ్బింగ్ యూనియన్ వివాదంలో నన్ను బలిపశువును చేశారు!: గాయని చిన్మయి

  • 95 మంది సభ్యులు రుసుం చెల్లించలేదు
  • నాకు అప్పటికే జీవితకాల సభ్యత్వం ఉంది
  • ట్విట్టర్ లో స్పందించిన గాయని చిన్మయి

తమిళ సినీపరిశ్రమతో పాటు డబ్బింగ్ యూనియన్ లో లైంగిక వేధింపులపై గాయని చిన్మయి శ్రీపాద గళమెత్తిన సంగతి తెలిసిందే. గీత రచయిత వైరముత్తుతో పాటు డబ్బింగ్ యూనియన్ చీఫ్ రాధా రవి చాలామంది యువతులను లైంగికంగా వేధించారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో చిన్మయిని యూనియన్ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆమె సభ్యత్వ రుసుము చెల్లించకపోవడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ పెద్దలు స్పష్టం చేశారు. తాజాగా ఈ వివాదంపై చిన్మయి మరోసారి స్పందించింది.

తమిళ డబ్బింగ్ యూనియన్ కు సంబంధించి 95 మంది సభ్యులు గత రెండేళ్లుగా ఎలాంటి సభ్యత్వ రుసుమును చెల్లించలేదని చిన్మయి తెలిపింది. కానీ ఈ వ్యవహారంలో తనను మాత్రమే బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను యూనియన్ లో జీవితకాల సభ్యత్వం కోసం 2016, ఫిబ్రవరి 11న బ్యాంక్ ద్వారా చెల్లింపు జరిపానని గుర్తుచేసింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.

More Telugu News