Telangana: కంటోన్మెంట్ లో రాత్రి కేటీఆర్ రోడ్ షో.. కేసు నమోదు చేసిన మారేడ్ పల్లి పోలీసులు!

  • రాత్రి 10.30 తర్వాత కొనసాగిన రోడ్ షో
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్
  • ఐపీసీ, సిటీ పోలీస్ చట్టం కింద కేసు నమోదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు కొరడా ఝుళిపించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్ణీత సమయం దాటడంతో టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న, ఇతరులపై ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మారేడ్ పల్లి పోలీసులు కేసు నమోదుచేశారు.

కంటోన్మెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్నకు మద్దతుగా గురువారం రాత్రి 10.30 గంటలు దాటినప్పటికీ మంత్రి కేటీఆర్ మారేడ్ పల్లి చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. ఈ ఘటనను గుర్తించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మారేడ్ పల్లి పోలీసులకు  ఫిర్యాదు చేశారు. కాగా, ఈ విషయమై మారేడ్ పల్లి పీఎస్ సీఐ శ్రీనివాసులు స్పందిస్తూ.. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నుంచి తమకు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి సాయన్న, ఇతరులపై ఐపీసీ 341, 188, 67 సెక్షన్లతో పాటు సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

More Telugu News