Pawan Kalyan: కోడికత్తిపై స్పందించిన ప్రభుత్వం నా విషయంలో స్పందించదా?: పవన్ సూటి ప్రశ్న

  • ఇసుక లారీలతో ఢీకొడుతున్నారు
  • నాకేమైనా జరిగితే డీజీపీదే బాధ్యత
  • సెక్యూరిటీ అడిగితే ఇంత వరకు దిక్కులేదు

ప్రజాపోరాట యాత్రలో భాగంగా శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ అధినేత జగన్‌పై కోడికత్తిదాడి జరిగితే స్పందించిన ప్రభుత్వం తమపై ఇసుక లారీలతో దాడిచేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇటీవల రాజానగరం సభకు వెళ్లివస్తుంటే తమ సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణించే కారును ఇసుక లారీ ఢీకొట్టిందని, హైదరాబాద్‌లో తమ నేత నాదెండ్ల మనోహర్ కారును కూడా ఇసుక లారీ ఢీకొట్టిందని అన్నారు. మనోహర్‌కు భద్రత కల్పించాలని నెల క్రితమే డీజీపీకి లేఖ రాశామని, అయినా స్పందన లేదన్నారు.

తనకు గానీ, తన సైనికులకు గానీ ఏమైనా జరిగితే అందుకు డీజీపీనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా అవినీతే కనిపిస్తోందని ఆరోపించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని టీడీపీ ప్రజలను ఎలా రక్షిస్తుందని ప్రశ్నించారు.

More Telugu News