Yanamala: ఏపీ ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులకు కేంద్రమే కారణం: యనమల

  • మూడుసార్లు ఇచ్చింది కేవలం రూ.3,979కోట్లు
  • రూ.12,099 కోట్లు రావాల్సి ఉంది
  • పోలవరానికి ఇచ్చింది రూ.6, 727కోట్లు
  • ఉమ్మడి రాష్ట్రం అప్పు రూ.18 వేల కోట్లపైనే

చట్ట ప్రకారం సమకూర్చాల్సిన నిధులను కూడా కేంద్రం ఇవ్వడం లేదని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులను లెక్కలతో సహా వివరించారు. తొలిఏడాది ఆర్ధికలోటు రూ.16,079కోట్లు ఉండగా మూడేళ్లలో కేంద్రం మూడుసార్లు ఇచ్చింది కేవలం రూ. 3,979కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇంకా ఆర్థిక లోటు కింద రూ.12,099 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు.

రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని.. ఇంకా వెయ్యికోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. పోలవరానికి నాలుగేళ్లుగా ఇచ్చింది రూ.6, 727కోట్లు.. అని... రావాల్సింది రూ.3,162కోట్లు అని యనమల తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం అప్పు రూ.18 వేల కోట్లపైనే ఉందని వెల్లడించారు. ఏపీ ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులకు కేంద్రమే కారణమని యనమల స్పష్టం చేశారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయలేదని.. కేంద్రం చూపుతున్న వివక్షకి బీజేపీ మూల్యం చెల్లించక తప్పదన్నారు.


More Telugu News