Ramcharan: పంచెకట్టులో ఆకట్టుకుంటున్న చెర్రీ

  • సినిమాపై అంచనాలను పెంచేసిన టీజర్
  • కార్తీక పౌర్ణమి సందర్భంగా పోస్టర్
  • సంక్రాంతికి కలుద్దామంటూ క్యాప్షన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. చెర్రీకి జంటగా కియారా అద్వాణి నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. పంచెకట్టులో చెర్రీ హారతి తీసుకుంటూ కనిపించి అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఈ పోస్టర్‌కు ‘కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. సంక్రాంతికి కలుద్దాం’ అనే క్యాప్షన్‌ను చిత్రబృందం జత చేసింది. ఈ చిత్రంలో వివేక్‌ ఒబెరాయ్‌‌, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More Telugu News