paruchuri: 'పౌర్ణమి'లో త్రిష పాత్ర బ్రతికితే బావుండేది: పరుచూరి గోపాలకృష్ణ

  • ముందుగానే విలన్ ను ప్రభాస్ కొట్టేశాడు 
  • ఫస్టాఫ్ లో త్రిష కనిపించలేదు
  • త్రిష పాత్ర చనిపోవడం ప్రేక్షకులకు నచ్చలేదు  

తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'పౌర్ణమి' సినిమాను గురించి ప్రస్తావించారు. "ఎప్పుడూ కూడా విలన్ ముందుగానే హీరోతో తలపడి ఓడిపోకూడదు. అలా జరిగితే ఆ కథపై ప్రేక్షకులకి ఆసక్తి తగ్గిపోతుంది. 'పౌర్ణమి' విషయంలో అదే జరిగింది. విలన్ ను చాలా ఎర్లీగా ప్రభాస్ వెళ్లి కొట్టేస్తాడు. దాంతో కథలో ఆడియన్స్ ఆశించే బిగువు సడలిపోయింది.

ఇక 'పౌర్ణమి'గా ఏ త్రిషనైతే ప్రేక్షకులు ఊహించుకుని వచ్చారో, ఆ త్రిష విశ్రాంతి వరకూ తెరపై కనిపించకపోవడం వాళ్లందరికీ నిరాశ ఎదురైంది. అందువలన ఫస్టాఫ్ లోకి త్రిష పాత్రను తీసుకొస్తే ప్రేక్షకులలో అసంతృప్తి లేకుండగా ఉండేది. ఇక త్రిష పాత్ర చనిపోవడమనేది ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఆమె పాత్ర బతికే వున్నట్టుగా కూడా కథను మార్చుకోవచ్చు. త్రిష పాత్ర చచ్చిపోలేదు అనే ఆనందం ఒకటి ప్రేక్షకులకు మిగిలేలా చేయగలిగితే బాగుండేది' అని చెప్పుకొచ్చారు.     

More Telugu News