Chandrababu: ఏపీ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది : విష్ణువర్ధన్‌రెడ్డి

  • పాలనా వ్యవహారాల్లో భాగంగానే నివేదికలు కోరుతారు
  • సమాఖ్య స్ఫూర్తిని టీడీపీతో సహా ఎవరైనా గౌరవించాల్సిందే
  • టీడీపీ అవినీతిని ఆ ప్రభుత్వంతో పనిచేసిన సీఎస్‌లే బయటపెడుతున్నారు

ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు అవసరమైన సహకారం అందిస్తామని ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పాలనాపరమైన అంశాల్లో భాగంగానే కేంద్రం, రాష్ట్రాలను నివేదికలు అడుగుతుందని, దాన్ని రాజకీయ కోణంలో చూస్తే రాష్ట్రాలకే నష్టం అన్నారు. శుక్రవారం ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. సమాఖ్య స్ఫూర్తిని ఎవరైనా గౌరవించాల్సిందేనని, ఇందుకు టీడీపీ ప్రభుత్వం మినహాయింపు కాదని స్పష్టం చేశారు.

ప్రతిపక్ష నేతపై కేసులు పెట్టినప్పుడు సీబీఐ మంచిది, ఇప్పుడు చెడ్డదా? అని ప్రశ్నించారు. సీబీఐ వద్దన్నట్టే కోర్టు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లను కూడా సొంతంగా పెట్టుకుంటారా? అన్నారు. ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక దేశం ఏమీ కాదని, రాష్ట్రంలో ఏమైనా నయా రాచరిక వ్యవస్థను తయారు చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. టీడీపీ అవినీతిని ఆ ప్రభుత్వంతో పనిచేసిన సీఎస్‌లే బయటపెడుతున్నారని గుర్తు చేశారు.

More Telugu News