Rajasthan: రాజస్థాన్‌లో బీజేపీ సంచలన నిర్ణయం.. నలుగురు మంత్రులు సహా 11 మంది రెబల్స్‌పై వేటు

  • నామినేషన్లు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ
  • 11 మంది సీనియర్ నేతల సస్పెన్షన్
  • ఆరేళ్లపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు

రాజస్థాన్ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ నామినేషన్లను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించిన 11 మంది సీనియర్ నేతలపై బీజేపీ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేసింది. వీరిలో ముఖ్యమంత్రి వసుంధర రాజే కేబినెట్‌లోని నలుగురు మంత్రులు కూడా ఉండడం గమనార్హం.

మొత్తం 11 మంది నేతల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ఆరేళ్లపాటు రద్దు చేసినట్టు గురువారం బీజేపీ ప్రకటించింది. పార్టీ సస్పెండ్ చేసిన వారిలో సురేంద్ర గోయల్, లక్ష్మీనారాయణ్ దవే, రాధేశ్యామ్ గంగాధర్, హేమ్‌సింగ్ భదానా, రాజ్‌కుమార్ రినావా, రామేశ్వర్ భాటి, కుల్దీప్ ధన్‌కడ్, దీన్‌దయాళ్ కుమావత్, కిషన్‌రామ్ నల్, ధన్‌సింగ్ రావత్, అనిత కటారా ఉన్నారు. రాజస్థాన్‌లో ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో తాజా ఘటన ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని అంటున్నారు.

More Telugu News