rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • శుక్రవారం పార్టీ గురించి రకుల్!
  • శ్రీవాస్ దర్శకత్వంలో మళ్లీ గోపీచంద్ 
  • చైతు, సమంతల విశాఖ 'మజిలి' ముగిసింది 

*  తన సినిమా ఫ్లాపయినా కూడా పార్టీ చేసుకుంటానని చెబుతోంది అందాలతార రకుల్ ప్రీత్ సింగ్. 'నేను నటించిన సినిమా హిట్టయితే శుక్రవారం పార్టీ చేసుకుంటా. ఒకవేళ ఫ్లాపయినా కూడా మిత్రులతో పార్టీ వుంటుంది. ఎందుకంటే, ఆ సినిమాలో నటించే అవకాశం రావడమే గొప్ప అన్న ఫీలింగ్ తో వుంటాను. ఇలాంటి అవకాశాలు లేక బోలెడు మంది వున్నారు. అందుకని మనకు హిట్టయినా, ఫ్లాపయినా పార్టీనే' అని చెప్పింది.
*  గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో త్వరలో మరో చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లోనూ లౌక్యం, లక్ష్యం చిత్రాలు వచ్చాయి.
*  నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న 'మజిలి' చిత్రం వైజాగ్ షెడ్యూల్ ముగిసింది. ఈ షెడ్యూల్ లో కొన్ని ముఖ్య సన్నివేశాలను దర్శకుడు శివ నిర్వాణ చిత్రీకరించారు. తదుపరి షెడ్యూలు ఈ నెల 26 నుంచి హైదరాబాదులో జరుగుతుంది.

More Telugu News