YSRCP: ‘కోడికత్తి’ నిందితుడు శ్రీనివాసరావుకు నేటితో ముగియనున్న రిమాండ్

  • గత నెల 25న విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి
  • శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
  • రిమాండ్‌‌ను మరో 14 రోజులు పొడిగించే అవకాశం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీనివాసరావు రిమాండ్ నేటితో ముగియనుంది. ప్రస్తుతం విశాఖపట్టణంలోని కేంద్రకారాగారంలో ఉన్న శ్రీనివాసరావును ఎయిర్‌పోర్టు పోలీసులు నేడు మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. అతడి బెయిలు పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే కొట్టివేయడంతో శ్రీనివాసరావుకు మరో 14 రోజులు రిమాండ్ పొడిగించే అవకాశం ఉంది.

గత నెల 25న విశాఖపట్టణం విమానాశ్రయంలో జగన్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ కేసు విషయంలో వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా పోలీసులు పలుమార్లు జగన్‌ను కోరినప్పటికీ ఆయన ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో తాజాగా మరోమారు జగన్‌కు పోలీసులు నోటీసులు పంపించారు. కేసు పురోభివృద్ధి కోసం వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోరారు.

More Telugu News