nithin: తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్' .. రీమేక్ హక్కులు తీసుకున్న నితిన్

  • నితిన్ హీరోగా 'భీష్మ'
  • జనవరి 7 నుంచి షూటింగ్ 
  • తమిళ రీమేక్ పై దృష్టి

ప్రస్తుతం నితిన్ తన తదుపరి చిత్రంగా 'భీష్మ' చేయడానికి సిద్ధమవుతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటించనుంది. జనవరి 7వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలోనే నితిన్ ఒక తమిళ హిట్ మూవీ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.

తమిళంలో రామ్ కుమార్ దర్శకత్వంలో 'రాచ్చసన్' సినిమా తెరకెక్కింది. విష్ణు విశాల్ - అమలాపాల్ జంటగా నటించిన ఈ సినిమా, అక్టోబర్ 5వ తేదీన విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఇది సస్పెన్స్ తో సాగే సైకో థ్రిల్లర్ కథ. ఇందులో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. నితిన్ ఇంతవరకూ పోలీస్ ఆఫీసర్ గా చేయలేదు గనుక, ఆ పాత్రపై మనసు పారేసుకుని తెలుగు రీమేక్ లో ఆయనే చేయనున్నాడా? లేదంటే నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడా? అనే విషయం తెలియాల్సి వుంది.      

More Telugu News