krishnavamsi: ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రగా కృష్ణవంశీ మూవీ?

  • వరుస పరాజయాలతో కృష్ణవంశీ
  • మరాఠీ మూవీని రీమేక్ చేసే ప్రయత్నం 
  • నిర్మాతగా దిల్ రాజు  

దర్శకుడు కృష్ణవంశీ నుంచి గతంలో చెప్పుకోదగిన సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలన్నీ కూడా ఆయన స్థాయిని పెంచుతూ వచ్చాయి. అలాంటి కృష్ణవంశీకి కొంతకాలంగా సక్సెస్ అనేది ముఖం చాటేస్తూ వస్తోంది. ఆయన కొన్ని ప్రాజెక్టులు సెట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చాడుగానీ, అవి కొన్ని కారణాల వలన పట్టాలెక్కలేదు.

ఈ నేపథ్యంలోనే ఆయన ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అది 'నట సామ్రాట్' అనే మరాఠీ సినిమాకి రీమేక్. నానా పటేకర్ ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమా, 2016లో హిట్ చిత్రాల జాబితాలో నిలిచింది. ఈ సినిమాకి నానా పటేకర్ ఒక నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అలాంటి ఈ సినిమాను కృష్ణవంశీ రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరాఠీలో నానా పటేకర్ చేసిన పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తాడట.  

More Telugu News