chaithu: 'మజిలీ' నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతోన్న సమంత - చైతూ

  • శివ నిర్వాణ తాజా చిత్రంగా 'మజిలీ'
  • సింహాచలంలో పూర్తయిన షూటింగ్
  • పెళ్లి తరువాత చైతూ - సమంతల ఫస్టు మూవీ    

'నిన్నుకోరి' సినిమా ప్రేమకథా చిత్రాలలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాతో దర్శకుడిగా శివ నిర్వాణకి మంచి పేరు వచ్చింది. ఆయన తదుపరి సినిమాగా 'మజిలీ' సెట్స్ పైకి వెళ్లింది. నాగచైతన్య .. సమంత జంటగా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే కొన్ని సన్నివేశాలను సింహాచలంలో చిత్రీకరించారు.

తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 26వ తేదీ నుంచి హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో సమంత - చైతూ భార్యాభర్తలుగా కనిపించనున్నారు. వివాహమైన తరువాత సమంత - చైతూ కలిసి నటిస్తోన్న తొలి సినిమా ఇదే కావడంతో అందరిలోనూ ఆసక్తి వుంది. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 

More Telugu News