vijay sethupathi: 'అయ్యా' పాత్రలో అదరగొట్టేస్తోన్న విజయ్ సేతుపతి

  • స్టార్ హీరో పాత్రలో విజయ్ సేతుపతి 
  • వయసు మళ్లిన వ్యక్తిగా కొత్త లుక్ 
  • వచ్చేనెల 20వ తేదీన విడుదల    

మొదటి నుంచి కూడా విజయ్ సేతుపతి వైవిధ్యభరితమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. అదే విధంగా ఆయన తాజా చిత్రంగా 'సీతా కాత్తి' నిర్మితమైంది. ఇది విజయ్ సేతుపతి 25వ సినిమా కావడం విశేషం. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ఈ సినిమాలో ఆయన స్టార్ హీరో పాత్రలో కనిపించనున్నాడు. అభిమానులంతా ఆయనని 'అయ్యా' అని పిలుచుకుంటూ వుంటారు.

స్టార్ ఇమేజ్ ఉండగా .. సినిమాల నిర్మాణం మధ్యలో ఉండగా హఠాత్తుగా ఆయన నటన నుంచి తప్పుకుంటాడు. ఎక్కడ చూసినా ఈ విషయంపైనే చర్చ. ఆయన మాత్రం చాలా ఉదాసీనంగా మారిపోయి .. సాధారణ జీవితం గడుపుతుంటాడు. అందుకు కారణమేమిటనేదే సస్పెన్స్. ఈ సినిమాలో వయసు మళ్లిన వ్యక్తిగా విజయ్ సేతుపతి లుక్ ఆశ్చర్య చకితులను చేస్తోంది. మౌళి .. అర్చన కీలకపాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా, వచ్చేనెల 20వ తేదీన విడుదల కానుంది.

More Telugu News