Tollywood: నేటితో నటుడిగా మా నాన్నకు 43 ఏళ్లు.. ట్విట్టర్ లో తెలిపిన మంచు లక్ష్మి!

  • 43 ఏళ్ల మీ సినీప్రయాణం అద్భుతం
  • కలెక్షన్ కింగ్ కు నమస్కరిస్తున్నా
  • తండ్రికి అభినందనలు తెలిపిన లక్ష్మి

డైలాగ్ కింగ్ మోహన్ బాబు మాటల గారడికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి 43 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి ట్విట్టర్ లో తన తండ్రికి అభినందనలు తెలిపింది. ‘సినీ పరిశ్రమలో 43 ఏళ్ల పాటు కొనసాగడం నిజంగా గొప్ప ప్రయాణం. ఈ అద్భుతాన్ని సాధించిన కలెక్షన్ కింగ్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నాన్న.. అభినందనలు’ అని #43YearsOfMB హ్యాగ్ ట్యాగ్ తో ట్వీట్ చేసింది.

More Telugu News