sumanth: ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'సుబ్రహ్మణ్యపురం' ట్రైలర్

  • సంతోష్ దర్శకుడిగా 'సుబ్రహ్మణ్యపురం'
  • ఆలయం చుట్టూ తిరిగే కథ
  • నాస్తికుడైన యువకుడిగా సుమంత్  

సుమంత్ కథానాయకుడిగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో 'సుబ్రహ్మణ్యపురం' సినిమా నిర్మితమైంది. 'సుబ్రమణ్యపురం' అనే గ్రామం చుట్టూ .. ఆ గ్రామంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సుబ్రమణ్యపురంలోని ఆలయం .. అక్కడ చోటుచేసుకునే సంఘటనలపై రీసెర్చ్ చేయడానికి వచ్చిన నాస్తికుడైన యువకుడిగా సుమంత్ కనిపిస్తున్నాడు. ఆ గ్రామంలో జరిగే కొన్ని అనూహ్యమైన సంఘటనలు .. గ్రామ పెద్దల హెచ్చరికలు .. ఊరి వదిలి వెళ్లేది లేదనే హీరో మొండితనానికి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ కొనసాగింది. 'గెలవడానికి ఆ భగవంతుడి సాయం కావాలని మేం నమ్ముతాం.. నువ్వేమో ఆ భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావ్' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News