malavika nair: విజయ్ దేవరకొండ అంటే ఇష్టం .. ఆయనేం మారలేదు: హీరోయిన్ మాళవిక నాయర్

  • 'ఎవడే సుబ్రహ్మణ్యం'లో కలిసి నటించాం 
  • అప్పుడు ఎలా వున్నాడో ఇప్పుడు అంతే 
  • ఆయనలోని ఆ లక్షణమే నచ్చుతుంది

మలయాళంలో మంచి క్రేజ్ వున్న మాళవిక నాయర్, 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత 'కల్యాణ వైభోగమే'.. 'విజేత' సినిమాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. ఇటీవల థియేటర్లకు వచ్చిన 'టాక్సీవాలా' సినిమాలోను ఆమె కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకి ఈ సినిమాలో మంచి పాత్ర పడిందనే సంతృప్తిని వ్యక్తం చేసింది.

విజయ్ దేవరకొండ గురించి ప్రస్తావిస్తూ .."నాకు నచ్చిన హీరో ఎవరంటే విజయ్ దేవరకొండ అని చెబుతాను. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో తొలిసారిగా కలిసి నటించాం. ఆ సినిమా సమయంలో విజయ్ దేవరకొండ ఎలా వున్నాడో, 'అర్జున్ రెడ్డి' .. 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్స్ తరువాత కూడా ఆయన అలాగే వున్నాడు .. ఏ మాత్రం మారలేదు. ఆయనలోని ఆ లక్షణమే నాకు నచ్చుతుంది .. అందుకే ఆయనంటే నాకు ఇష్టం" అని చెప్పుకొచ్చింది. 

More Telugu News