18న వైకుంఠ ఏకాదశి... భద్రాచలం టికెట్లు ఆన్ లైన్లో!

22-11-2018 Thu 08:55
  • మూడు రకాల టికెట్లు
  • రూ. 1000, రూ. 500, రూ. 200
  • ఆన్ లైన్ లో అందుబాటులోకి: ఈఓ
భద్రాచలంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో డిసెంబర్ 8 నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. 18వ తేదీన పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రానుండగా, స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శించునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తాళ్లూరి రమేశ్ బాబు తెలియజేశారు.

భక్తుల కోసం ఇంటర్నెట్ లో సెక్టార్ ల వారీగా టికెట్లను అందుబాటులో ఉంచామని అన్నారు. భక్తులు రూ. 1000, రూ. 500, రూ. 200 టికెట్లను కొనుగోలు చేయవచ్చని, ఈ టికెట్లను www.bhadrachalamonline.com వెబ్‌ సైట్‌ లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు.