KBC: అప్పుడు నేను పడ్డ బాధ వర్ణనాతీతం... అభిమానులను కలవరపెట్టే వార్త చెప్పిన అమితాబ్!

  • కేబీసీ సీజన్ వన్ సమయంలో వెన్నుపాము సంబంధిత క్షయవ్యాధి
  • కుర్చీలో కూర్చుంటే ఎంతో నొప్పి కలిగేది
  • ఇప్పుడిప్పుడే కోలుకున్నానన్న అమితాబ్

తనకు ప్రమాదకరమైన వెన్నుపాము సంబంధిత క్షయ వ్యాధి సోకిందని బాలీవుడ్ బిగ్ బీ అభిమానులు కలవరపడే వార్తను చెప్పారు. 'కౌన్ బనేగా కరోడ్ పతి' పదవ సీజన్ లో అహ్మదాబాద్ నుంచి వచ్చిన కాజల్ పటేల్, హాట్ సీట్ పై కూర్చుని, అమితాబ్ ను ఓ ప్రశ్న అడుగగా, ఆయన సమాధానం ఇచ్చారు. 2000 సంవత్సరంలో కేబీసీ తొలి సీజన్ ను ప్రారంభించిన వేళ, తనలో వెన్నుపాము సంబంధిత వ్యాధి ఉన్నట్టు తేలిందని, ఆ సమయంలో తానెన్నో ఇబ్బందులు పడ్డానని అన్నారు.

 కుర్చీలో కూర్చుంటే నొప్పి వచ్చేదని, తగు చికిత్స చేయించుకున్నానని, దాని బారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడ్డానని అన్నారు. ఈ వ్యాధి ఉన్న సమయంలో నొప్పి తగ్గేందుకు ఎన్నో మందులు వాడాల్సి వచ్చిందని చెప్పారు. ఈ వ్యాధితో ఎంతో మంది బాధపడుతున్నారని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయాల్సి వుందని అమితాబ్ బచ్చన్ తెలిపారు.

More Telugu News