Chandrababu: చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటన

  • చంద్రబాబు కుటుంబసభ్యుల ఆస్తి రూ.88.66 కోట్లు
  • సీఎం చంద్రబాబు ఆస్తి- రూ.2.9 కోట్లు
  • ఆస్తుల వివరాలు వెల్లడించిన నారా లోకేశ్

వరుసగా ఎనిమిదోసారి చంద్రబాబు కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తుల వివరాలను వెల్లడించారు. చంద్రబాబు కుటుంబసభ్యుల మొత్తం ఆస్తి రూ.88.66 కోట్లుగా ఏపీ మంత్రి నారా లోకేశ్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ, రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీతనం ఉండాలని అన్నారు.

2011 నుంచి తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నామని,  భారతదేశంలోని ఏ రాజకీయ కుటుంబం కూడా ఈ విధంగా తమ ఆస్తుల గురించి ప్రకటించట్లేదని అన్నారు. ఆదర్శంగా నిలవాలని, రాజకీయాల్లో విలువలు పెంచాలనే ఉద్దేశంతోనే తాము ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. తాము అధికారంలో ఉన్నా లేకున్నా ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నామని అన్నారు. గతంలో తాము ఏ ధరకు కొనుగోలు చేశామో, వాటి ఆధారంగానే ఏటా ఆస్తులను ప్రకటిస్తున్నామని, మార్కెట్ విలువ ప్రతిసారీ పెరుగుతుందని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తి- రూ.2.9 కోట్లు
నారా భువనేశ్వరి ఆస్తి- రూ.31.01 కోట్లు
నారా లోకేశ్ ఆస్తి - రూ.21.40 కోట్లు
నారా బ్రాహ్మణి ఆస్తి- రూ.7.72 కోట్లు
నారా దేవాన్ష్ ఆస్తి- రూ. 18.71 కోట్లు

కాగా, నిర్వాణ హోల్డింగ్స్ నికర ఆస్తులు రూ.6.83 కోట్లు అని, హెరిటేజ్ సంస్థ నికర లాభం రూ.60.38 కోట్లుగా లోకేశ్ ప్రకటించారు.

More Telugu News