vijay: సంచలనమే .. 250 కోట్ల వసూళ్ల దిశగా 'సర్కార్'

  • తొలి వారంలో 100 కోట్ల గ్రాస్ 
  • రెండవ వారంలో 200 కోట్లకి పైగా 
  • విజయాన్ని ఆపలేకపోయిన వివాదాలు

మురుగదాస్ .. విజయ్ కాంబినేషన్లో వచ్చిన 'కత్తి' .. 'తుపాకి' సినిమాలు ఒక దానికి మించి మరొకటి భారీ వసూళ్లను సాధించాయి. మూడవ సినిమాగా వచ్చిన 'సర్కార్' ఆ రెండు సినిమాలను మించిన వసూళ్లను రాబడుతుండటం విశేషం. తొలి వీకెండ్ ముగిసే సమయానికి 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'సర్కార్' .. 2వ వారంలో 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

మూడవ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా, 250 కోట్ల మార్క్ ను చేరుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా 247 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సినిమా విడుదలకి ముందు .. తరువాత కూడా కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. అయినా వసూళ్లను అవి ఎంత మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. దీపావళి తరువాత వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడటం, ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. మొత్తానికి విజయ్ ఈ ఏడాది చివరిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

More Telugu News