t20: టీ20: వర్షం కారణంగా 17 ఓవర్లకు మ్యాచ్ కుదింపు.. నిరాశపరిచిన రోహిత్ శర్మ

  • 17 ఓవర్లలో 158 పరుగులు చేసిన ఆస్ట్రేలియా
  • టీమిండియా టార్గెట్ 174 పరుగులు
  • 7 పరుగులకే ఔటైన రోహిత్ శర్మ

బ్రిస్బేన్ లో ఇండియా-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి టీ20ని వర్షం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ను 17 ఓవర్లకు కుదించారు. 17 ఓవర్లలో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో డక్ వర్త్ లూయీస్ నిబంధనల ప్రకారం టీమిండియా టార్గెట్ ను 174 పరుగులుగా నిర్ణయించారు.

ఆసీస్ బ్యాట్స్ మెన్లలో షార్ట్ 7, ఫించ్ 27, లిన్ 37, మ్యాక్స్ వెల్ 46 పరుగులు చేసి ఔటయ్యారు. స్టోయినిస్ 33, మెక్ డర్మాట్ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా, బుమ్రా, కేకే అహ్మద్ లు చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. 8 బంతులను ఎదుర్కొన్న రోహిత్ శర్మ (7) బెహ్రెన్ డార్ఫ్ బౌలింగ్ లో ఫించ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఎండ్ లో ధావన్ 33 (22 బంతులు, 6 ఫోర్లు) ధాటిగా ఆడుతున్నాడు. అతనికి అండగా కేఎల్ రాహుల్ 3 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

More Telugu News