vijaydevarakonda: 3 రోజుల్లోనే 25 కోట్ల క్లబ్ లోకి 'టాక్సీవాలా'

  • తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న వసూళ్లు 
  • అమెరికాలో తగ్గని జోరు 
  • కర్ణాటకలోను లాభాల బాట      

విజయ్ దేవరకొండ హీరోగా ఈ నెల 17వ తేదీన 'టాక్సీవాలా' థియేటర్లలోకి వచ్చింది. ప్రియాంక జవాల్కర్ .. మాళవిక నాయర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంది. విడుదలకి ముందే ఈ సినిమా రష్ లీక్ అయినప్పటికీ, భారీ ఓపెనింగ్స్ ను రాబట్టి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.

ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 10.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, 3వ రోజు పూర్తయ్యేనాటికి 25 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోను తన జోరును కొనసాగిస్తోంది. ఇక కర్ణాటకలోను ఈ సినిమా లాభాల బాట పట్టడం విశేషం. విజయ్ దేవరకొండకి 'నోటా'తో ఫ్లాప్ పడటంతో డీలాపడిపోయిన ఆయన అభిమానులు, 'టాక్సీవాలా' హిట్ కొట్టడంతో హుషారెత్తిపోతున్నారు.       

More Telugu News