Chandrababu: తెలంగాణలో ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లోకి!: సీఎం కేసీఆర్

  • నాన్- బీజేపీ, నాన్- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి
  • కేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలి
  • తెలంగాణ ఎన్నికల్లో నిజాయతీ నేతలనే గెలిపించాలి

తెలంగాణలో ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, నాన్- బీజేపీ, నాన్- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేందుకు కృషి చేస్తామని చెప్పారు. కేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో నిజాయతీ నేతలనే ప్రజలు గెలిపించాలని, పొరపాటున కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకొస్తే, తెలంగాణ మళ్లీ చీకట్లోకి వెళుతోందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓట్లు వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే పోరాడి సాధించామో, ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లు కూడా సాధిస్తామని స్పష్టం చేశారు. దేవరకొండలో టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. 

More Telugu News