sharwanand: శర్వానంద్ మూవీ శాటిలైట్ హక్కులు 12 కోట్లు!

  • రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగే మూవీ 
  • ఫుట్ బాల్ ప్లేయర్ గా శర్వానంద్ 
  • డిసెంబర్ 21వ తేదీన సినిమా రిలీజ్   

శర్వానంద్ - సాయిపల్లవి జంటగా 'పడి పడి లేచె మనసు' నిర్మితమైంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందింది. కథలో కొత్తదనం .. కథనంలో ఆసక్తి ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే టాక్ ఇటు శర్వానంద్ విషయంలోను .. అటు సాయిపల్లవి విషయంలోను వుంది. అందువలన ఈ సినిమాపై క్రేజ్ వుంది.

ఈ కారణంగానే విడుదలకి ముందే ఈ సినిమా శాటిలైట్ హక్కుల విషయంలో భారీ డీల్ కుదిరింది. ఈ సినిమా శాటిలైట్ .. డిజిటల్ హక్కులు, హిందీ డబ్బింగ్ రైట్స్ కలుపుకుని 12 కోట్లు పలికినట్టుగా సమాచారం. శర్వానంద్ కెరియర్లో ఆయన సినిమాకి ఈ స్థాయి రేటు పలకడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఫుట్ బాల్ ప్లేయర్ గా శర్వానంద్ .. డాక్టర్ గా సాయిపల్లవి నటించిన ఈ సినిమాను, డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.  

More Telugu News