indonesia: విమానం ఎక్కేందుకు రన్ వే పై యువతి పరుగులు.. కష్టపడి అడ్డుకున్న అధికారులు!

  • ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఘటన
  • ఆలస్యంగా వచ్చి విమానం మిస్ అయిన యువతి
  • మరో విమానంలో పంపిన ఎయిర్ పోర్టు అధికారులు

సాధారణంగా ప్రయాణాలు చేసేటప్పుడు చాలామంది కొంచెం ముందుగానే బస్టాండ్, రైల్వే స్టేషన్ లేదా ఎయిర్ పోర్టుకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకుంటారు. అందుకు అనుగుణంగా ఓ గంట లేదా అరగంట ముందుగానే బయలుదేరుతారు. కానీ అనుకోకుండా ఎయిర్ పోర్టుకు ఆలస్యంగా చేరుకున్న యువతి విమానం మిస్ కావడాన్ని తట్టుకోలేకపోయింది. ఎలాగైనా ఈ విమానాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్న ఆమె సెక్యూరిటీని తప్పించుకుని ఫ్లైట్ దగ్గరకు పరుగెత్తింది. ముందుగా విమానం వెళుతుంటే దాని వెనుకే పరిగెత్తడం మొదలుపెట్టింది. చివరికి అధికారులు ఎలాగోలా సదరు యువతిని పట్టుకోగలిగారు.  

ఈ ఘటన ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఉన్న నుగురాహ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. సిటీలింక్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం బాలీ నుంచి జకార్తాకు బయలుదేరింది. అయితే నిర్ణీత సమయంలోగా ఓ యువతి బోర్డింగ్ వద్దకు చేరుకోలేకపోయింది. దీంతో విమానం రన్ వే పైకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి లోనైన యువతి ఎలాగైనా విమానం ఎక్కాలని నిర్ణయించుకుంది. వెంటనే అధికారుల నుంచి తప్పించుకుని రన్ వే పైకి పరుగుపెట్టింది. ఆమెను గమనించిన అధికారులు వెంటనే యువతిని అడ్డుకున్నారు. అయినప్పటికీ ఆగకపోవడంతో చేతులకు బేడీలు వేసి ఎయిర్ పోర్టులోకి తీసుకెళ్లారు. చివరికి మరో విమానంలో ఆమెను ఎక్కించి ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News