titli storm: తిత్లీ బాధితులకు కౌశల్ ఆర్మీ అపన్నహస్తం.. ప్రోమో వీడియోను విడుదల చేసిన కౌశల్!

  • శ్రీకాకుళాన్ని వణికించిన తిత్లీ తుపాను
  • సహాయక చర్యల్లో పాల్గొన్న కౌశల్ ఆర్మీ
  • నేడు వీడియో రిలీజ్ చేయనున్న కౌశల్

తెలుగు తెరపై వచ్చిన బిగ్ బాస్-2 రియాలిటీ షోలో కౌశల్ మండ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే కౌశల్ కు మద్దతుగా అభిమానులు ‘కౌశల్ ఆర్మీ’ని ఏర్పాటు చేశారు. కేవలం కౌశల్ కు ప్రచారం నిర్వహించడం మాత్రమే కాకుండా తిత్లి తుపాను సందర్భంగా కౌశల్ మద్దతుదారులు సహాయక కార్యక్రమాలను సైతం చేపట్టారు. ఈ నేపథ్యంలో కౌశల్ ట్విట్టర్ లో స్పందించాడు.

కౌశల్ ఆర్మీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో తిత్లి బాధితులను ఆదుకునేందుకు సహాయక  చర్యలు చేపట్టినట్లు కౌశల్ తెలిపాడు. తిత్లి బాధితులకు మద్దతుగా కౌశల్ ఆర్మీ చేసిన సహాయక కార్యక్రమాల వీడియోను ఈ రోజు విడుదల చేస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన చిన్నపాటి వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

More Telugu News