namitha: బరువు తగ్గిన నమిత .. ఆమె ప్రధాన పాత్రగా 'అహంభావం'

  • బాగా బరువు పెరిగిన నమిత 
  • ఆ కారణంగానే తగ్గిన అవకాశాలు 
  • పవర్ ఫుల్ రోల్ తో రీ ఎంట్రీ     

తెలుగు .. తమిళ భాషల్లో నమితకు మంచి క్రేజ్ వుంది. తమిళంలో అగ్రకథానాయికగా కొంతకాలంపాటు ఒక వెలుగు వెలిగింది. ఆ తరువాత ఆమె విపరీతంగా బరువు పెరిగిపోవడంతో, అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నమితకు వివాహం కావడం .. నటనకు ఆమె మరింత దూరం కావడం జరిగిపోయాయి.

అలాంటి నమిత తిరిగి సినిమాల్లోకి రావాలనే ఉద్దేశంతో బరువు తగ్గడంపై దృష్టి పెట్టింది. ఈ విషయంలో గట్టిగానే కసరత్తులు చేసి కొంతవరకూ బరువు తగ్గింది. అలా కాస్త సన్నబడిన నమితను ప్రేక్షకులు 'అహంభావం' సినిమాలో చూడొచ్చు. ఆమె ప్రధాన పాత్రగా ఈ తమిళ సినిమా రూపొందుతోంది. కొన్ని యాథార్థ సంఘటనల ఆధారంగా నిర్మితమవుతోన్న ఈ ద్విభాషా చిత్రానికి శ్రీమహేష్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో నమిత గ్లామర్ గా కనిపించదనీ .. నటనకు ప్రాధాన్యమున్న పవర్ఫుల్ పాత్రలో ఆమె కనిపిస్తుందని చెబుతున్నారు.         

More Telugu News