Twitter: రెండో పుట్టినరోజు జరుపుకుంటున్న అర్హా.. కుమార్తెకు శుభాకాంక్షలు తెలిపిన బన్నీ!

  • ఫొటోలను ట్విట్టర్ లో పంచుకున్న బన్నీ
  • తన చబ్బీ బొమ్మకు రెండేళ్లు వచ్చాయని వెల్లడి
  • బ్లూ కలర్ డ్రస్సులో మెరిసిపోతున్న అర్హా

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హా ఈ రోజు రెండో పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో బన్నీ ట్విట్టర్ లో తన ముద్దుల కుమార్తెకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘నా చబ్బీ బొమ్మ.. అర్హాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నేటితో అర్హా రెండేళ్లకు చేరుకుంటుంది. ఉమ్మా..’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ‘TWO’ అనే అక్షరాలను పట్టుకుని బ్లూ కలర్ డ్రస్సులో మెరిసిపోతున్న అర్హా ఫొటోలను బన్నీ అభిమానులతో పంచుకున్నాడు.

More Telugu News