Goa: రోడ్డెక్కిన వందలాది మంది... పారికర్ రాజీనామాకు డెడ్ లైన్!

  • సీఎం పారికర్ కు అనారోగ్యం
  • గోవాలో కుంటుపడిన పాలన
  • ప్రజలు, విపక్షాల భారీ ర్యాలీ

గోవా రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అనారోగ్యంతో ఉన్న ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, వందలాది మంది ప్రజలు ఆయన ఇంటివైపు ర్యాలీగా బయలుదేరడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పారికర్ స్థానంలో పూర్తిస్థాయి సీఎంను వెంటనే నియమించాలని పలువురు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పారికర్ 48 గంటల్లోగా రాజీనామా చేయాలని డెడ్ లైన్ పెట్టారు. పారికర్ ఇంటికి సుమారు ఒక కిలోమీటర్ దూరం వరకూ ఈ భారీ ర్యాలీ సాగింది. ఇందులో కొందరు కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు.

"పీపుల్స్ మార్చ్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ గవర్నెన్స్" పేరిట ర్యాలీ సాగింది. ఎన్సీపీ, శివసేన తదితర పార్టీలు ఈ ర్యాలీకి మద్దతు పలకడం, పలు ఎన్జీవో సంస్థలు, సామాజిక కార్యకర్తలు హాజరు కావడంతో ర్యాలీ విజయవంతమైంది. కాగా, పారికర్ అనారోగ్యంతో ఉండి ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో దాదాపు ఏడాదిగా గోవా రాష్ట్రంలో పరిపాలన కుంటు పడిందన్నది విపక్షాల అభియోగం

More Telugu News