nani: నాని దూకుడు మీదే ఉన్నాడు!

  • క్రికెట్ నేపథ్యంలో సాగే కథ 
  • డిఫరెంట్ లుక్స్ తో నాని 
  • నెక్స్ట్ మూవీ ఇంద్రగంటితో

వరుస సినిమాలతో నాని దూసుకుపోతున్నాడు. సినిమాకి .. సినిమాకి మధ్యనే కాదు, షెడ్యూల్ కి .. షెడ్యూల్ కి మధ్య కూడా ఆయన గ్యాప్ తీసుకోవడం లేదు. అలా ఆయన చకచకా 'జెర్సీ' షూటింగును కానిచ్చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. క్రికెట్ నేపథ్యంలో కొనసాగే ఈ కథలో నాని డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.

 శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, రీసెంట్ గా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే నిన్నటి నుంచి రెండవ షెడ్యూల్ ను మొదలు పెట్టారు. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో ప్లాన్ చేశారు. అనిరుథ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని నాని భావిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ఇంద్రగంటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.   

More Telugu News