Puri Jagannadh: పూరి జగన్నాథ్ దర్శకుడిగా రామ్ మూవీ

  • రొమాంటిక్ లవ్ స్టోరీతో రామ్ 
  • విభిన్నమైన కంటెంట్ తో ఆకాశ్  
  • రెండు సినిమాలతో బిజీగా పూరి  

ఒక వైపున పూరి జగన్నాథ్ .. మరోవైపున రామ్ వరుస పరాజయాలతో సతమతమైపోతున్నారు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కాంబినేషన్ సెట్ అయిందనేది తాజా సమాచారం. రొమాంటిక్ లవ్ స్టోరీతో కూడిన యాక్షన్ తో ఈ కథ కొనసాగనుంది. పూరి సొంత బ్యానర్ .. స్రవంతి మూవీస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.

త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో వైపున పూరి తన తనయుడు ఆకాశ్ హీరోగా చేయనున్న సినిమాకి సంబంధించిన పనులను కూడా చక్కబెడుతూనే వున్నాడు. అనిల్ అనే కుర్రాడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 'మెహబూబా' తరువాత కొంత గ్యాప్ తీసుకున్న పూరి, మళ్లీ బిజీ కానున్నాడన్న మాట.      

More Telugu News