nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తెలుగులోకి నయనతార హిట్ చిత్రం 
  • తన ఫేవరైట్ దర్శకుడితో మరోసారి అజిత్ 
  • అయ్యప్పకథతో భారీ బడ్జెట్ చిత్రం  

*  నయనతార ప్రధాన పాత్ర పోషించిన 'ఇమైక్క నోడిగల్' తమిళ చిత్రాన్ని తెలుగులోకి 'అంజలి విక్రమాదిత్య' పేరిట అనువదిస్తున్నారు. ఇందులో నయనతార చేసిన సాహసాలు థ్రిల్లింగ్ గా ఉంటాయని, జనవరిలో చిత్రాన్ని రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు.
*  తమిళ్ స్టార్ హీరో అజిత్ కి బాగా ఇష్టమైన దర్శకుడు శివ. ఇప్పటివరకు ఇతనితో మూడు చిత్రాలు చేసిన అజిత్ ప్రస్తుతం అతని దర్శకత్వంలో 'విశ్వాసం' చిత్రం చేస్తున్నాడు. ఇది సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత మళ్లీ శివతోనే మరో చిత్రం చేయాలని అజిత్ నిర్ణయం తీసుకున్నాడట. ఇది వచ్చే ఏడాది సెట్స్ కి వెళుతుంది.
*  ప్రముఖ మలయాళ నటుడు పృధ్వీరాజ్ తాజాగా శబరిమల అయ్యప్ప కథతో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'అయ్యప్పన్' పేరుతో రూపొందే ఈ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నాడు. శంకర్ రామకృష్ణన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తారు.

More Telugu News