Chandrababu: తెలంగాణలో ఆ రెండు పార్టీలు ఎందుకు పోటీ చేయడం లేదో తెలుసా?: చంద్రబాబు

  • పెద్ద నోట్ల రద్దు పెద్ద ఫార్స్
  • కాంగ్రెస్‌తో విభేదాలను పక్కనపెట్టింది అందుకే
  • వైసీపీ, జనసేన లాలూచీ రాజకీయాలకు ఇది నిదర్శనం

నెల్లూరులోని ఎస్వీజీఎస్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన టీడీపీ ధర్మ పోరాట దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ, జనసేనపై మరోమారు విమర్శలు గుప్పించారు. తెలంగాణలో జరగనున్న శాసనసన ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పోటీ చేయకపోవడం వెనక చాలా కథ ఉందన్నారు. టీఆర్ఎస్‌తో ఒప్పందం కారణంగానే వారు బరిలోకి దిగలేదని, లాలూచీ రాజకీయాలకు ఇంతకంటే వేరే నిదర్శనం అవసరం లేదన్నారు.

దేశంలో అవినీతిని బీజేపీ పెంచి పోషిస్తోందన్న చంద్రబాబు.. దేశం కోసమే తాను 40 ఏళ్ల విభేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌కు దగ్గరైనట్టు చెప్పుకొచ్చారు. సీబీఐని గుజరాత్‌కు చెందిన ఆస్థానా భ్రష్టుపట్టించారని, దోవల్ కూడా ఈ వ్యవహారంలో ఉన్నారంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో పరిస్థితి దారుణంగా తయారైందని, రూపాయి విలువ పడిపోయిందని అన్నారు. మోదీ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని చంద్రబాబు పేర్కొన్నారు.

More Telugu News