kcr: ‘తెలంగాణ’లో టీడీపీ లేదంటూనే ఆ విమర్శలెందుకు?: కేసీఆర్ పై నామా నాగేశ్వరరావు ఫైర్

  • సెంటిమెంట్ ను కేసీఆర్ మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు
  • అందుకే, చంద్రబాబు లక్ష్యంగా వ్యాఖ్యలు
  • కేసీఆర్ పాలనలో వేల పరిశ్రమలు మూతపడ్డాయి

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై టీ-టీడీపీ నేత నామా నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో టీడీపీ పార్టీయే లేదంటున్న కేసీఆర్, ఇంకా, మా పార్టీపై, నాయకులపై విమర్శలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. సెంటిమెంట్ ను మళ్లీ తెరపైకి తెచ్చేందుకే చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో ప్రాజెక్టులకు అడ్డుతగులుతూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారన్న విమర్శలను ఆయన ఖండించారు. కేసీఆర్ పాలనలో ఎనిమిది వేల పరిశ్రమలు మూతపడ్డాయని, ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట అంచనా వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచారని విమర్శించారు. తెలంగాణకు ఉక్కు ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్శిటీని ఎందుకు తీసుకురాలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు.

More Telugu News