akhil: 'మిస్టర్ మజ్ను'కోసం సిక్స్ ప్యాక్ .. ఉపవాసంతో అఖిల్ డాన్స్

  • అఖిల్ మూడో సినిమాగా 'మిస్టర్ మజ్ను' 
  • దర్శకుడిగా వెంకీ అట్లూరి 
  • సినిమాకి హైలైట్ కానున్న అఖిల్ డాన్స్

అఖిల్ మూడవ సినిమాగా 'మిస్టర్ మజ్ను' రూపొందుతోంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా కోసం ఒక పాటను చిత్రీకరించారట. ఈ పాటలో షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ కనిపించేలా అఖిల్ డాన్స్ చేశాడని అంటున్నారు.

సాధ్యమైనంత వరకూ అఖిల్ సిక్స్ ప్యాక్ ను ఫోకస్ చేస్తూ ఈ పాటను చిత్రీకరించారు. సిక్స్ ప్యాక్ పెర్ఫెక్ట్ గా కనిపించడం కోసం . . క్లిష్టతరమైన స్టెప్స్ వేయడం కోసం, ఈ పాట చిత్రీకరణ పూర్తయ్యేంత వరకూ అఖిల్ ఎలాంటి ఆహరం తీసుకోలేదని చెబుతున్నారు. కేవలం మంచినీళ్లు మాత్రమే తాగుతూ ఈ డాన్స్ చేశాడని అంటున్నారు. నీరసం వచ్చి పడిపోతాడేమోనని టీమ్ అంతా అలర్ట్ గా వున్నట్టుగా చెబుతున్నారు. అఖిల్ పడిన కష్టానికి తగినట్టుగా అవుట్ పుట్ వచ్చిందట. ఈ సినిమాకి ఈ డాన్స్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.    

More Telugu News