MeToo India: 'మీటూ' దెబ్బా... మజాకా?: నిబంధనలు మారుస్తున్న కార్పొరేట్లు!

  • ఆఫీసుల్లో రొమాన్స్ చేయడానికి వీల్లేదని ఆదేశాలు
  • నిబంధనలను మార్చిన 78 శాతం కంపెనీలు
  • ఓ అధ్యయనంలో వెల్లడి

ప్రపంచమంతా సంచలనం సృష్టించిన 'మీటూ' దెబ్బకు కార్పొరేట్ కంపెనీలు దిగొచ్చాయి. పని చేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపులపై యువతులు చేస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో పేరున్న పెద్ద కంపెనీలు ఆందోళనలో పడ్డాయని ఓ అధ్యయనం వెల్లడించింది. దాదాపు 80 మంది మానవ వనరుల విభాగాల అధికారులను ప్రశ్నించిన ఓ సంస్థ తమ అధ్యయనంలో తేలిన అంశాలను మీడియా ముందు ఉంచింది.

ఆఫీసుల్లో ఎవరూ రొమాన్స్ చేయడానికి వీల్లేదని దాదాపు అన్ని కంపెనీలూ ఆంక్షలు విధించాయి. యూకేలో 20 కార్పొరేట్ సంస్థలు ఇటువంటి వ్యవహారాలపై పూర్తిగా నిషేధం విధించగా, 78 శాతం కంపెనీలు ఉద్యోగుల మధ్య ఉండాల్సిన సంబంధాల విషయంలో ఉన్న పూర్వపు నియమ నిబంధనలను సమీక్షించి, వాటిలో మార్పులను సూచించాయి.

కాగా, 'మీటూ' ఉద్యమం తీవ్రతరమైన తరువాత, ఎంతో మంది సెలబ్రిటీలు, ప్రముఖులు చీకట్లో సాగించిన కామ కలాపాలను, పలువురు మహిళలు వెలుగులోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి చెబుతుండటంతోనే పరిస్థితిలో మార్పు కనిపిస్తోందని ఈ సంస్థ తన నివేదికలో పేర్కొంది.

More Telugu News