kamal: మళ్లీ విలన్ గానే శంకర్ మూవీలో అక్షయ్ కుమార్

  • శంకర్ నెక్స్ట్ మూవీగా 'భారతీయుడు 2'
  • ముఖ్య పాత్రల్లో నయన్ .. కాజల్
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేలా సన్నాహాలు

శంకర్ దర్శకత్వంలో రూపొందిన '2.ఓ' సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించనున్నాడు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని బలమైన ప్రతినాయక పాత్ర .. తనకి మరింత మంచి పేరును తీసుకొస్తుందని అక్షయ్ కుమార్ భావిస్తున్నాడు. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతుండగానే, శంకర్ మరో మూవీలోనూ అక్షయ్ ఛాన్స్ కొట్టేశాడని చెబుతున్నారు.

శంకర్ తదుపరి సినిమాగా 'భారతీయుడు 2' నిర్మితం కానుంది. కమల్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో, విలన్ పాత్రకి గాను అజయ్ దేవగణ్ ను అనుకున్నారు. అయితే డేట్స్ సర్దుబాటు కాని కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి అజయ్ తప్పుకున్నాడట. దాంతో ఈ పాత్రను గురించి అక్షయ్ కి శంకర్ చెప్పడం .. ఆయన ఓకే అనడం జరిగిపోయాయని చెబుతున్నారు. నయనతార .. కాజల్ .. శింబు .. దుల్కర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.    

More Telugu News