Chandrababu: పదో తరగతి విద్యార్థికి లుకేమియా... చంద్రబాబు ఉదారత!

  • బాలుడికి నెల రోజుల క్రితం జ్వరం
  • వైద్య పరీక్షలు చేయిస్తే లుకేమియాగా నిర్ధారణ
  • రూ. 8 లక్షలు మంజూరు చేసిన సీఎం

పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి అరుదైన లుకేమియా వ్యాధి సోకిందని తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, అతనికి వెంటనే రూ. 8 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందిస్తున్నట్టు ప్రకటించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లా మానేపల్లి గ్రామానికి చెందిన మద్దుల రాజేశ్వరి కుమారుడు గిరీష్ కు ఇటీవల డెంగీ జ్వరం రాగా, తొలుత కామినేనికి, జ్వరం తగ్గకపోవడంతో ఆపై రెయిన్ బో ఆసుపత్రికి తరలించారు.

 ప్రత్యేక వైద్య పరీక్షల్లో అతనికి లుకేమియా ఉందని, చికిత్సకు లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో ఆ తల్లి సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలను ఆశ్రయిస్తూ, ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, హోమ్ మంత్రి చినరాజప్పల సిఫార్సు పత్రాలతో ఉండవల్లికి వచ్చి సీఎంను కలిసింది. ఆమె ఆర్థిక స్థితిని గమనించిన సీఎం, రూ. 8 లక్షలు మంజూరు చేయడంతో పాటు, భవిష్యత్తులోనూ వైద్య పరమైన సాయం చేస్తానని చెప్పారు.

More Telugu News