Rashmika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తమిళంలో రష్మికకు భారీ ఆఫర్
  • పవన్ కల్యాణ్ రాజకీయ సినిమా!
  • జర్నలిస్టు పాత్రలో నమిత  

*  'గీతగోవిందం' ఫేం రష్మిక మందన భారీ ఆఫర్ కొట్టేసింది. తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించే ఛాన్స్ ఆమెకు వచ్చినట్టు చెబుతున్నారు. అట్లీకుమార్ దర్శకత్వంలో విజయ్ నటించే చిత్రంలో నాయిక పాత్రకు రష్మికను తీసుకున్నారట.
*  ఇటీవల రాజకీయ కార్యకలాపాలలో బిజీ అయిపోయిన ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ త్వరలో మళ్లీ ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రాజకీయ డ్రామాతో కూడిన కథను ఎంచుకున్నట్టు, రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం.
*  పెళ్లి తర్వాత కూడా కథానాయిక నమితకు తమిళంలో అవకాశాలు వస్తూనే వున్నాయి. ఈ క్రమంలో తాజాగా శ్రీమగేష్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించడానికి నమిత ఓకే చెప్పింది. ఇందులో ఓ జర్నలిస్టు పాత్రలో ఆమె నటిస్తుందట.

More Telugu News