YSRCP: రోజా నోరు మంచిది కాదు.. ఆమె గురించి మాట్లాడను: చినరాజప్ప

  • రాజకీయ దురుద్దేశంతోనే జగన్ ఆరోపణలు
  • కుట్రలు జగన్‌కు కొత్త కాదు
  • జగన్, పవన్ నోరెందుకు మెదపడం లేదు?


వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ డీప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. జగన్ రాజకీయ దురుద్దేశంతోనే తన హత్యకు చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపిస్తున్నారని అన్నారు.  లేకపోతే ఘటన జరిగిన 20 రోజుల తర్వాత కోడికత్తి గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. అయినా, కుట్రలు చేయడం జగన్‌కు, ఆ పార్టీ నేతలకు కొత్త కాదన్నారు. సోమవారం రాత్రి చినరాజప్ప దంపతులు శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. కిడారి సర్వేశ్వరరావు హత్య దురదృష్టకరమన్న హోంమంత్రి బాక్సైట్ తవ్వకాలకు తమ ప్రభుత్వం ఎప్పటికీ వ్యతిరేకమేనని అన్నారు. వైసీపీ నేత రోజా నోరు మంచిది కాదని, ఆమె గురించి తాను మాట్లాడబోనని అన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై జగన్, పవన్‌లు నోరు మెదపడం లేదని, కేంద్రంపై పోరాడాల్సిన బాధ్యత వారికి లేదా? అని సూటిగా ప్రశ్నించారు.

More Telugu News