nayanatara: తెలుగు తెరకి నయన్ తమిళ హిట్ మూవీ

  • 'ఇమైక్కా నోడిగళ్' తమిళంలో హిట్  
  • తెలుగు అనువాదానికి సన్నాహాలు 
  • త్వరలో విడుదల తేదీ ప్రకటన    

తమిళంలో నయనతారకి దక్కిన వరుస విజయాలలో ఒకటిగా .. ఆమె చేసిన వైవిధ్యభరితమైన సినిమాలలో ఒకటిగా 'ఇమైక్కా నోడిగళ్' కనిపిస్తుంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది ఆగస్టు చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, అధర్వ .. రాశిఖన్నా .. అనురాగ్ కాశ్యప్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

భారీ వసూళ్లతో ఈ సినిమా తన ప్రత్యేకతను చాటుకుంది. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయాలనుకున్నారు గానీ కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాను 'అంజలి .. విక్రమాదిత్య' అనే పేరుతో అనువదించి విడుదలకి సిద్ధం చేస్తున్నారు. రాంబాబు - ఆచంట గోపీనాథ్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.   

More Telugu News