Andhra Pradesh: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి ప్రయత్నిస్తుంటే బీజేపీ అడ్డుకుంటోంది!: బుద్ధా వెంకన్న

  • భూముల్ని అమిత్ షా కుమారుడికి ఇచ్చేందుకు కుట్ర
  • వైసీపీ కోడికత్తి డ్రామా ఆడుతోంది
  • బహిరంగ చర్చకు రావాలని బీజేపీకి సవాల్

అగ్రిగోల్డ్ ఆస్తులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జయ్ షా కు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు టీడీపీ ప్రభుత్వం న్యాయం చేసేందుకు యత్నిస్తోందని తెలిపారు. అయితే ఈ ప్రయత్నాలను బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకన్న మాట్లాడారు.

ప్రతిపక్ష వైసీపీ కోడికత్తి డ్రామా ఆడుతుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ అగ్రిగోల్డ్ డ్రామా ఆడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి నాటకాలను ఆధారాలతో బయటపెడతానని వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంపై బీజేపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

More Telugu News