kollywood: లైంగిక వేధింపులను బయటపెట్టినందుకు ఓ ఆర్టిస్టును తప్పించారు.. ఛాన్సులు వచ్చినా అడ్డుకుని వేధించారు!: చిన్మయి శ్రీపాద

  • తమిళ డబ్బింగ్ యూనియన్ పై చిన్మయి ఫైర్
  • గొంతెత్తేవారిని అణచివేస్తున్నారని మండిపాటు
  • ట్విట్టర్ లో సందేశాన్ని పోస్ట్ చేసిన గాయని

తమిళ సినీ పరిశ్రమలో సాగుతున్న లైంగిక వేధింపుల పర్వాన్ని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద బయటపెట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ గీతరచయిత వైరముత్తు, తమిళ డబ్బింగ్ అసోసియేషన్ చీఫ్ రాజా చాలామంది మహిళా ఆర్టిస్టులను లైంగికంగా వేధించారని ఆరోపించి సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో యూనియన్ నుంచి చిన్మయిని తప్పిస్తూ రాజా నోటీసులు జారీచేశారు. కాగా, తాజాగా చిన్మయి మరోసారి సోషల్ మీడియాలో స్పందించింది.

డబ్బింగ్ యూనియన్ లో తనకు ఎదురైన వేధింపులు, సమస్యలను ప్రస్తావించినందుకు బూమారావు అనే మహిళా ఆర్టిస్టును యూనియన్ పెద్దలు తప్పించారని చిన్మయి తెలిపింది. ఈ విషయంలో యూనియన్ నిర్ణయాన్ని సవాలుచేస్తూ కోర్టుకు వెళ్లి ఆమె విజయం సాధించారని వెల్లడించింది.

ఆ తర్వాత బూమారావును యూనియన్ లో చేర్చుకున్నప్పటికీ ఆమెకు వచ్చిన ప్రాజెక్టులను వరుసగా రద్దు చేస్తూ వేధింపులు కొనసాగించారని పేర్కొంది. బూమారావు, దాశరథి.. ఇలా వేధింపులపై ప్రశ్నించినవాళ్లను తప్పించారనీ, బాధితులకు ఏ ఒక్కరూ మద్దతు ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చిన్మయి ఈ రోజు ట్వీట్ చేశారు.

More Telugu News