Congress: మహాకూటమిలో ట్విస్ట్... 94కు బదులు 100 స్థానాల్లో పోటీకి దిగిన కాంగ్రెస్!

  • 100 మందికి బీఫామ్ లు ఇచ్చిన ఉత్తమ్
  • ఇబ్రహీంపట్నంలో అయోమయం
  • కొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీ అంటున్న కాంగ్రెస్

ఇది మహాకూటమిలో మరో ట్విస్ట్... పొత్తులో భాగంగా 94 స్థానాల్లో పోటీ చేసి, మిగతా సీట్లను తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐ పార్టీలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, అనూహ్యంగా 100 స్థానాలకు బీఫామ్ లు ఇచ్చింది. నేటి ఉదయం ఉత్తమ్ కుమార్ మరో ఆరు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించుతూ వారికి బీఫామ్ లు ఇచ్చారు.

హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డికి, దుబ్బాకలో మద్దుల నాగేశ్వర్ కు, పటాన్ చెరులో కాట శ్రీనివాస్ కు ఉత్తమ్ బీఫామ్ లు ఇచ్చారు. టీడీపీకి కేటాయించిన ఇబ్రహీంపట్నం సీటులో ఆ పార్టీ సామ రంగారెడ్డికి బీఫామ్ ఇవ్వగా, నేడు ఉత్తమ్ మల్ రెడ్డి రంగారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ స్థానంలో అయోమయం నెలకొంది. వరంగల్ తూర్పు, మహబూబ్ నగర్, మిర్యాలగూడల్లో మహాకూటమి పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని కాంగెస్ వర్గాలు అంటున్నాయి.

More Telugu News