formula one: జలక్రీడలకు అనువైన వాతావరణం విజయవాడలో ఉంది: ఫార్ములావన్ హెచ్ 2వో చైర్మన్ నికోలస్

  • జలక్రీడల శిక్షణా సంస్థ ఏర్పాటుకు సిద్ధం
  • జల ఉత్సవాలు నిర్వహించాలని సీఎం సూచించారు
  • ఫార్ములా వన్ బోట్ రేసింగ్ ఫైనల్స్ నేడు

విజయవాడలోని కృష్ణా నదిలో ఫార్ములా వన్ బోట్ రేసింగ్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫార్ములా వన్ హెచ్ 2వో చైర్మన్ నికోలస్ మాట్లాడుతూ, జలక్రీడలకు అనువైన వాతావరణం విజయవాడలో ఉందని, ఏపీలో జలక్రీడలకు సంబంధించిన శిక్షణా సంస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఫిబ్రవరిలో జల ఉత్సవాలు నిర్వహించాలని సీఎం చందబ్రాబు సూచించారని, ఆ అంశంపై కసరత్తు జరుగుతున్నట్టు చెప్పారు. ఇక్కడ నిర్వహిస్తున్న ఫార్ములా వన్ రేసింగ్ పోటీల్లో పాత రికార్డులను తిరగరాసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కాగా, ఫార్ములా వన్ బోట్ రేసింగ్ ఫైనల్ పోటీలు జరుగుతున్నాయి.

More Telugu News