syra: ‘సైరా’ మూవీ అప్ డేట్.. నయనతార మోషన్ టీజర్ విడుదల!

  • నయన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్
  • శుభాకాంక్షలు తెలిపిన సినిమా యూనిట్
  • 2019, ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అతిపెద్ద బడ్జెట్ తో చారిత్రక నేపథ్యంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, నయనతార సహా పలువురు హేమాహేమీ నటులతో ఈ క్రేజీ ప్రాజెక్టును దర్శకుడు సురేందర్ రెడ్డి చేపట్టారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ తాజాగా మోషన్ టీజర్ ను విడుదల చేసింది.

ఈరోజు నయనతార పుట్టిన రోజు సందర్భంగా సైరా టీం ‘నయనతార మోషన్ టీజర్‘ను రిలీజ్ చేసింది. నయనతారకు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సినిమాలో నయనతార పేరు ‘సిద్దమ్మ’గా ఉంటుందని వెల్లడించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ సన్నాహాలు చేసుకుంటున్నాడు.

More Telugu News