Gaja: ఎటుపోతుందో చెప్పలేం.... తీరం దాటిన తరువాత తిరిగి ఉద్ధృతమైన 'గజ'!

  • వారం రోజులుగా భయపెడుతున్న గజ
  • శుక్రవారం నాడు తీరం దాటిన తుపాన్
  • ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తిరిగి బలం

గడచిన వారం రోజులుగా తమిళనాడు వాసులకు తీవ్ర ఆందోళనకు గురి చేసి, శుక్రవారం నాడు తీరాన్ని దాటి, పెను నష్టాన్ని కలిగించిన 'గజ' తుపాను భయం ఇంకా వీడలేదు. తీరం దాటిన తరువాత కూడా 'గజ' విజృంభిస్తూ, అత్యంత నెమ్మదిగా కదులుతోంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా ఉన్న కారణంగా, 'గజ', మరో 12 గంటల్లోగా తిరిగి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది ప్రస్తుతం తమిళనాడు, కేరళ సరిహద్దులపై ఆవరించివుందని, తదుపరి రెండు రోజుల్లో ఇది ఎటైనా కదలవచ్చని అధికారులు హెచ్చరించారు. కాగా, తుపాను ప్రభావంతో తమిళనాడులోని కోయంబత్తూర్ తదితర ప్రాంతాలతో పాటు కేరళలోని పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

More Telugu News