allu arjun: ఆసక్తిని చూపని బన్నీ .. సెట్ కాదన్న నాని!

  • ముందుగా బన్నీ దగ్గరికి వెళ్లిన కథ
  • అంతగా ఆసక్తిని చూపని బన్నీ
  • తన నుంచి ఫ్యాన్స్ ఆశించే కథలు వేరన్న నాని  

రవితేజ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన 'అమర్ అక్బర్ ఆంటోని' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ తో సందడి చేస్తున్నాడు. శ్రీను వైట్ల ముందుగా ఈ కథను అల్లు అర్జున్ కి వినిపించాడట. శ్రీను వైట్ల సినిమాల్లోని కామెడీని ఎక్కువగా ఇష్టపడే బన్నీ, ఈ కథపై పెద్దగా ఆసక్తిని చూపలేదట. దాంతో ఈ కథ నాని దగ్గరికి వెళ్లిందట. కథ వినేసిన నాని .. ఈ తరహా కథలు తన ఇమేజ్ కి సెట్ కావని చెప్పేశాడట. అప్పుడు ఈ కథ రవితేజ దగ్గరికి వెళ్లిందని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. శ్రీను వైట్లతో గల సాన్నిహిత్యం కారణంగా, గతంలో తమ కాంబినేషన్లో హిట్స్ రావడం వలన రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. అలా రవితేజ జాబితాలోకి చేరిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను రాబడుతుందో చూడాలి.

More Telugu News