nandita shweta: 'అక్షర' మూవీ లాంచ్ .. క్లాప్ ఇచ్చిన దిల్ రాజు

  • తెలుగు తెరపైకి మరో హారర్ థ్రిల్లర్ 
  • నందిత శ్వేత ప్రధాన పాత్రగా 'అక్షర'
  • దర్శకుడిగా చిన్నికృష్ణ పరిచయం

తెలుగు తెరపై హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల జోరు కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలోనే 'అక్షర' అనే సస్పెన్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను నందిత శ్వేత పోషించనుంది. ఈ సినిమాను కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు. సినిమా హాల్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగును జరుపుకోనుంది. చిన్నికృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు క్లాప్ కొట్టడంతో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. నిన్న కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేసి, ఈ రోజున సినిమాను లాంచ్ చేయడం విశేషం. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో నందిత శ్వేత తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ జోనర్ తరహా సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. పాత్రగా ఆమె కాలేజ్ లెక్చరర్ గా కనిపిస్తోంది. ఇక కథలో ఎలాంటి మలుపులు ఉంటాయనేది వేచిచూడాలి.     

More Telugu News